: న్యూజిలాండ్ పై వాళ్ల దేశంలోనే పైచేయి సాధించిన బంగ్లాదేశ్!


అవకాశం వస్తే ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా ఉన్న దేశంగా పేరున్న బంగ్లాదేశ్, తొలిసారిగా న్యూజిలాండ్ పై వారి దేశంలోనే పైచేయి సాధించింది. వెల్లింగ్టన్ లో ఇరు దేశాల మధ్యా జరుగుతున్న టెస్టులో సమష్టిగా రాణించి, తొలి ఇన్నింగ్స్ ను 595/8 వద్ద డిక్లేర్ చేసిన బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ను 539 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచే అవకాశాలు లేనప్పటికీ, తాము విదేశీ గడ్డపై రాణించగలమని బంగ్లా ఆటగాళ్లు నిరూపించారు.

తాము చేసిన స్కోరుకన్నా, న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేయడం ఆ దేశపు మానసిక బలాన్ని మరింతగా పెంచే అంశమని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు. ఓపెనర్ లాథమ్ 177 పరుగులు చేసినప్పటికీ, మరో సెంచరీని సాధించడంలో మిగతా న్యూజిలాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో సమకాలీన క్రికెట్ ప్రపంచపు టాప్-3లోని జట్టుతో బంగ్లాదేశ్ ఈ తరహా ప్రదర్శన కనబరచడం, అది కూడా వారి సొంత గడ్డపై కావడంతో బంగ్లా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News