: ఉత్తమ నటుడు అమీర్... 'దంగల్'కు ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట... విజేతల పూర్తి జాబితా


గత సంవత్సరం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అద్భుత కలెక్షన్లు సాధించిన అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు అవార్డులను అందుకుంది. జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2017 పూర్తి జాబితా ఇది.
ఉత్తమ నటుడు: అమీర్ ఖాన్ - దంగల్
ఉత్తమ నటి: ఆలియా భట్ - ఉడ్తా పంజాబ్
ఉత్తమ చిత్రం: దంగల్
ఉత్తమ దర్శకుడు: నితీశ్ తివారీ - దంగల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): నీర్జా
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): షాహిద్ కపూర్ - ఉడ్తాపంజాబ్, మనోజ్ బాజ్ పాయి - అలీగఢ్
ఉత్తమ నటి (క్రిటిక్స్): సోనమ్ కపూర్ - నీర్జా
ఉత్తమ నటుడు (షార్ట్ ఫిల్మ్): మనోజ్ బాజ్ పాయి - తాండవ్
ఉత్తమ లఘు చిత్రం (పీపుల్స్ చాయిస్): కామాఖ్య
ఉత్తమ నటి (షార్ట్ ఫిల్మ్): తాస్కా చోప్రా - చట్నీ
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: అశ్వనీ అయ్యర్ తివాలీ - నిల్ బట్టే సనాటా
ఉత్తమ నటుడు (డెబ్యూ) దిల్ జిత్ దోసాంజ్ - ఉడ్తా పంజాబ్
ఉత్తమ నటి (డెబ్యూ): రితికా సింగ్ - సాలా ఖడూస్
ఉత్తమ మాటల రచయిత: రితీష్ షా - పింక్
ఉత్తమ స్క్రీన్ ప్లే: శకున్ బాత్రా మరియు దేవిత్రీ ధిల్లాన్ - కపూర్ అండ్ సన్స్
ఉత్తమ సహాయ నటుడు: రిషి కపూర్ - కపూర్ అండ్ సన్స్
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ - నీర్జా
ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు: శత్రుఘన్ సిన్హా
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్ - ఏ దిల్ హై ముష్కిల్
ఉత్తమ పాటల రచయిత: అమితాబ్ భట్టాచార్య - ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి గాను 'చన్నా మీరియా' పాటకు
ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ - ఏ దిల్ హై ముష్కిల్
ఉత్తమ గాయని: నీహా భాసిన్ - సుల్తాన్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: రెడ్ చిల్లీస్ - ఫ్యాన్
ఉత్తమ ఎడిటింగ్: మోనీషా బల్దావా - నీర్జా
ఉత్తమ కాస్ట్యూమ్స్: పాయల్ సలూజా - ఉడ్తా పంజాబ్
ఉత్తమ యాక్షన్: శ్యామ్ కౌషల్ - దంగల్
ఉత్తమ నేపథ్య సంగీతం: సమీర్ ఉదిన్ - కపూర్ అండ్ సన్స్
ఉత్తమ నృత్య దర్శకుడు: ఆదిల్ షేక్ - కపూర్ అండ్ సన్స్

  • Loading...

More Telugu News