: కోడి పందాలు ఆడేందుకు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన ఎంపీ జేసీ!
తన మాటల తూటాలతో విరుచుకుపడుతూ, నిత్యమూ వార్తల్లో ఉండే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోడి పందాల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అయి భీమవరంలో ఏర్పాటు చేసిన ఓ కోడి పందాల బరి వద్దకు ఆయన వచ్చారు. ఉత్సాహంగా పందాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇదే సమయంలో కోళ్లకు కత్తులు కట్టేందుకు తాను వ్యతిరేకమని, ఏం చేసినా జీవ హింస జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నది తన సలహా అని అన్నారు. జేసీతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు సైతం పందాల్లో పాల్గొన్నారు.