: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పార్కులో యువకుడి ఆత్మహత్యాయత్నం


బెంగ‌ళూరులో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు వేధించారని న‌గ‌రంలోని మహాలక్ష్మి లే అవుట్‌లో ఓ యువకుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. తాను ఆ ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా సెల్ఫీ వీడియో తీశాడు. వేణుగోపాల్‌ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉండే పార్కుకు వెళ్లి రెండు పేజీల ఆత్మ‌హ‌త్య లేఖ‌ను రాసి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అక్క‌డ పడిపోయి ఉన్న ఆ యువ‌కుడిని గుర్తించిన స్థానికులు అత‌డి తల్లిదండ్రులకు ఈ విష‌యాన్ని తెలిపారు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడు ఎం.ఎస్‌.రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ యువ‌కుడు రాసిన‌ సూసైడ్‌నోట్‌లో మహాలక్ష్మి లే అవుట్‌ ఇన్ స్పెక్టర్‌పై ఆరోపణలు వున్నాయి.
 
బాధిత యువ‌కుడి పేరు వేణుగోపాల్.. ఓ యువతితో ప్రేమ‌లో ఉన్నాడు. అయితే, అత‌డికి తన‌ ప్రియురాలితో విభేదాలు వ‌చ్చాయి. అనంత‌రం తమ కుమార్తెను ఆ యువ‌కుడు వేధిస్తున్నాడని అత‌డి ప్రియురాలి తల్లిదండ్రులు పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. గురువారం ఆ యువ‌కుడి తండ్రిని పోలీస్టేషనకు తీసుకెళ్ళిన పోలీసులు ఆ రోజంతా అత‌డిని విచారించారు. వేణుగోపాల్‌తో దుర్భాషలాడుతూ మాట్లాడారు. దీంతో మ‌న‌స్తాపానికి గుర‌యిన వేణుగోపాల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.

  • Loading...

More Telugu News