: మోదీలా గాంధీజీ రూ.10 లక్షల సూట్ వేసుకుని వెళ్లలేదు: గాంధీజీ మునిమనవడి ఆగ్రహం
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్, డైరీలపై మహాత్మా గాంధీ బొమ్మ వేయకుండా నరేంద్ర మోదీ చిత్రాలను ప్రచురించడం పట్ల పలువురి నుంచి విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీజీ అప్పట్లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లేటప్పుడు కూడా ఖద్దరు దుస్తులే ధరించారని చెప్పిన ఆయన... మోదీలా గాంధీజీ రూ.10 లక్షల సూట్ వేసుకెళ్లలేదని వ్యాఖ్యానించారు. చేతిలో చరఖా, మనసులో గాడ్సే. టీవీలలో జోకర్‌ని జోకర్ అని పిలవడంలో తప్పులేదు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేవీఐసీని పూర్తిగా మూసేయాలని అన్నారు. 1931 సంవత్సరంలో గాంధీజీ ధోవతి, శాలువా మాత్రమే ధరించి బ్రిటన్ ఐదో జార్జి రాజును, మేరీని కలిశారని ఆయన గుర్తు చేశారు.