: అల్లరి నరేష్ గారూ.. అలాంటి సీన్లు చేయకండి మీరు.. ఇలాంటి సీన్లు చేయండి!: ఆర్. నారాయణమూర్తి సలహా
నాడు రాజేంద్ర ప్రసాద్ ప్రేక్షకులని కడుపుబ్బానవ్వించారని, ఇప్పుడు అల్లరి నరేష్ అలాంటి నటుడేనని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. సంక్రాంతి సందర్భంగా అల్లరి నరేష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఓ వీడియో క్లిప్ ద్వారా నారాయణ మూర్తి అల్లరి నరేష్‌కి సందేశం పంపించారు. అందులో ఆయన మాట్లాడుతూ... ‘అల్లరి నరేష్ గారూ, బ్రహ్మాండమైన యాక్టర్ మీరు.. ఆనాడు రాజేంద్రప్రసాద్.. ఈ రోజు మీరు.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. మీకో సూచన చేస్తున్నాను... చాలా సినిమాల్లోని హైలైట్ అయిన సీన్లను తీసుకొని వాటిని ఇమిటేట్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు... అది మానుకోవాలి మీరు... మీ స్టైల్లోనే నవ్వించండి.. ఏడిపించండి.. నవరసాలు పండించడగలరు మీరు. ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ నటించండి. మీరు బ్రహ్మాండమైన యాక్టర్’ అని తనదైన శైలిలో సలహా ఇచ్చారు.