: కోడి పందేల వివాదం: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘర్షణకు దిగిన రెండు గ్రామాల యువకులు


పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా కోడిపందేలు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌లుచోట్ల గొడ‌వ‌లు కూడా చెల‌రేగాయి. జిల్లాలోని పాలకొల్లు మండలంలోని దగ్గులూరులో తీవ్ర ఘ‌ర్ష‌ణ చెల‌రేగ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేయాల్సి వ‌చ్చింది. ఆ గ్రామంలో పలువురు వ్యక్తులు కోడి పందేలను నిర్వహిస్తున్న వేళ.. పక్క గ్రామానికి చెందిన యువకులతో వారు గొడ‌వ పెట్టుకున్నారు. కొద్దిసేప‌టికే ఈ గొడ‌వ మ‌రింత పెరిగి ఒక‌రిపై ఒక‌రు దాడికి దిగారు. దీంతో అక్క‌డ‌కు చేరుకున్న‌ పోలీసులు కోడి పందేలను అడ్డుకున్నారు. ఆగ్ర‌హించిన ప‌లువురు యువకులు రాస్తారోకో నిర్వహించి ఆందోళ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News