: యువరాజ్ ను తీసుకోవడానికి కారణం ఇదే!: కోహ్లీ


ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే సిరీస్ జట్టులో యువరాజ్ సింగ్ అనూహ్యంగా స్థానం సంపాదించుకున్నాడు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో, యువీని తీసుకోవడం వెనకున్న కారణాన్ని కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. టాప్ ఆర్డర్ ను తాను చూసుకుంటానని... ఒకవేళ తాను విఫలమైతే మిడిల్ ఆర్డర్ లో ఉన్న ధోనీపై ఒత్తిడి పడుతుందని... మిడిల్ ఆర్డర్ లో యువీ ఉంటే ధోనీపై ఒత్తిడి తగ్గుతుందని... అందువల్లే యువీని జట్టులోకి ఎంపిక చేశామని తెలిపాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే రేపు పూణేలో జరగనుంది. టెస్టుల్లో ప్రదర్శించిన దూకుడునే వన్డేల్లో కూడా కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. 

  • Loading...

More Telugu News