: బంపర్ ఆఫర్ ప్రకటించిన టెలినార్
ఉచిత మంత్రంతో మార్కెట్లోకి అడుగుపెట్టి మిగతా టెలికాం కంపెనీల ముందు విపరీతమైన పోటీ ఉంచిన రిలయన్స్ జియోను ఎదుర్కోవడానికి ఇప్పటికే ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు తమ వినియోగదారుల ముందు బంపర్ ఆఫర్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే బాటలో నడుస్తూ ఇప్పుడు టెలినార్ కూడా తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ ఇటీవలే 4జీ సెగ్మెంట్‌లోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ఆ కంపెనీ చేసిన తాజా ప్రకటన ప్రకారం అందనున్న డేటా వివరాలు...
* రూ. 11 రీచార్జ్ తో ఒక రోజంతా అన్‌లిమిటెడ్ 4జీ డేటా ( అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్‌లు కూడా చేసుకోవచ్చు)
* రూ. 239 రీచార్జ్ తో 6జీబీ 4జీ డేటా (28 రోజుల వ్యాలిడిటీ)
* సెలెక్టెడ్ యూజర్లకు 57 రూపాయలకే 1జీబీ 4జీ డేటా (28 రోజుల వ్యాలిడిటీ)
* రూ. 98 రీచార్జ్ తో 2జీబీ డేటా ( 28 రోజులు వ్యాలిడిటీ)