: కోస్తాను తలదన్నేలా కోడి పందేలను నిర్వహిస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి


సనాతన సంప్రదాయాలు, చరిత్ర కోస్తాకే కాదు, రాయలసీమకు కూడా వున్నాయని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి, కళలను కాపాడుకోవడానికి తాము కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సంప్రదాయంలో భాగంగా కోడి పందేలు, పందుల పందేలు, పొట్టేళ్ల పందేలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పందేలు కేవలం జంతువులకే కాదని... మనుషులకు కూడా ఉన్నాయని తెలిపారు. బరువులు మోయడం, ఇరుసులు ఎత్తడం వంటి పందేలు మనుషులకు ఉంటాయని చెప్పారు. వచ్చే ఏడాది కోడి పందేలకు కోర్టు అనుమతి ఇస్తే... కోస్తాను తలదన్నేలా పందేలను నిర్వహిస్తామని అన్నారు. వచ్చే ఏడాది 40 ఎకరాల స్థలంలో అన్ని రకాల పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News