: ఫైనల్ లో ముంబయిని ఓడించిన గుజరాత్.. రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచి రికార్డు
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి టీంతో తలపడిన గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించి తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ అద్భుతంగా రాణించి, మొదటి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులు చేసి జట్టు విజయానికి కారకుడయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రంజీట్రోఫీ చరిత్రలో ముంబయి జట్టు 41సార్లు టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అటువంటి జట్టును ఓడించిన గుజరాత్ గెలుపు ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు. ముంబయి మొదటి ఇన్నింగ్స్ లో 228 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 411 చేసింది. ఇక గుజరాత్ మొదటి ఇన్నింగ్స్ లో 328, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది.