: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పాశ్వాన్
లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత కారణాలతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో గురువారం సాయంత్రం ఆయనను పాట్నాలోని ఓ హాస్పిటల్ లో చేర్చారు. పాశ్వాన్ ఆసుపత్రిలో ఉన్న రెండు రోజులూ ఆసుపత్రి వద్ద సందడి నెలకొంది. ఎల్జేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు పోటెత్తారు.