: జ‌ల్లిక‌ట్టు రచ్చ‌.. మ‌ధురైలో ఉద్రిక్త‌త‌.. లాఠీఛార్జ్‌


సంక్రాంతి సంద‌ర్భంగా త‌మిళ‌నాడులో నిర్వ‌హించే 'జల్లికట్టు' క్రీడకు అనుమ‌తి ఇవ్వాల‌ని త‌మిళులు ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో త‌మిళ‌నాడులోని ప‌లుచోట్ల ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. రాష్ట్రంలోని పలుచోట్ల జ‌ల్లిక‌ట్టు మ‌ద్ద‌తుదారులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. పండుగ సందర్భంగా నిర్వహించే ఈ క్రీడ త‌మ‌ సంస్కృతికి నిదర్శనమని నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో జ‌ల్లికట్టును నిర్వహించేందుకు ప్ర‌య‌త్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా మధురై జిల్లాలోని అవనిపురం, పలెమేడు, అళంగనల్లూరు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. మ‌రోవైపు అవనియపురం వద్ద ప‌లువురు ఆందోళ‌న జరపడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొంద‌రిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేష‌న్‌కు త‌రలించారు.

  • Loading...

More Telugu News