: జల్లికట్టుపై స్పందించిన రజనీకాంత్


తమిళనాడులోని సంప్రదాయ జల్లికట్టు ఆటను సుప్రీంకోర్టు నిషేధించడంతో.. దీనిని ఖండిస్తూ జల్లికట్టు ఉండాల్సిందే అంటూ సీనీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా తమ మద్దతును తెలుపుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. పొంగల్ పండుగ సందర్భంలో నిర్వహించే జల్లికట్టు తమిళ సంస్కృతికి నిదర్శనమని, ఈ కారణం వల్లనైనా జల్లికట్టును నిర్వహించి తీరాల్సిందే అని చెప్పారు. 'కావాలనుకుంటే ఎలాంటి నిబంధనలనైనా విధించండి... కానీ జల్లికట్టును మాత్రం నిషేధించకండి' అంటూ తలైవా తన స్పందనను తెలియజేశారు. 2014లో జల్లికట్టును సుప్రీంకోర్టు నిషేధించింది.

  • Loading...

More Telugu News