: మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించండి: పాక్ సెనేటర్ సయ్యద్


మద్యం తాగే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలంటూ పాక్ లోని అవామీ నేషనల్ పార్టీ సెనేటర్ షాహీ సయ్యద్ చేసిన సూచన ఆ దేశంలో కలకలం రేపుతోంది. పాకిస్థాన్ లో ముస్లిం మతస్తులు మద్యం తాగడం నిషేధం. పట్టుబడితే ఆరు నెలల నుంచి, ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇతర మతస్తులకు మాత్రం మద్యం తాగే విషయంలో కొంత వెసులుబాటు ఉంది. లైసెన్స్ కలిగిన దుకాణాల ద్వారా ఇతర మతస్తులకు మద్యం విక్రయిస్తున్నారు. దీని గురించి షాహీ సయ్యద్ సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.

గంజాయి, నల్లమందు, దార్వేష్ అనే మత్తు పానీయాలపైన కూడా నిషేధం విధించాలని సయ్యద్ సూచించారు. మద్యం, గంజాయి, నల్లమందు, దార్వేష్ లను సేవించే రాజకీయ నాయకులకు మరణశిక్ష విధించాలని అన్నారు. దేశంలో హిందువు పేరుతో ముస్లిం వ్యక్తి మద్యం విక్రయించడం విచారకరమని వ్యాఖ్యానించారు.  

  • Loading...

More Telugu News