: పాక్ చర్యలతో అణు యుద్ధ ప్రమాదం: అమెరికా
రష్యా, ఉత్తర కొరియా దేశాలతో కలసి పాకిస్థాన్ చేపడుతున్న అణ్వస్త్ర కార్యకలాపాలతో ప్రపంచం ముందు అణు యుద్ధ ప్రమాదం నెలకొందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ హెచ్చరించారు. భారత ఉపఖండంపైనే పాక్ అణ్వాయుధాలు ప్రయోగించే భయాలు పెరిగాయని ఆయన అన్నారు. "కేవలం నార్త్ కొరియా మాత్రమే కాదు. రష్యా పాకిస్థాన్ తదితర దేశాలు అణు ఆయుధాల తయారీలో నిమగ్నం కావడంతో యూరప్, దఫిణాసియా, తూర్పు ఆసియా దేశాలకు ప్రమాదభరితమే" అని ఆయన అన్నారు.
యూఎస్ కాంగ్రెస్ తో కలసి పని చేస్తూ, తదుపరి ప్రభుత్వానికి ఈ ప్రమాదాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాను సిద్ధమని ఆయన అన్నారు. ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని దేశాలూ ముందుకు రావాలని అన్నారు. కేవలం ఒక్క బాంబుతో పెను వినాశనం సంభవిస్తుందని, అందువల్లే ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అణ్వస్త్ర వ్యాప్తికి నడుంబిగించిందని అన్నారు. అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో పడితే, జరిగే అనర్థాన్ని ఊహించలేమని హెచ్చరించారు.