: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలలో అజారుద్దీన్ కు ఎదురు దెబ్బ.. నామినేషన్ తిరస్కరణ!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని చేపట్టాలనుకున్న క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్ష పదవికోసం ఆయన వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. తనపై ఉన్న జీవితకాల నిషేధంపై అజారుద్దీన్ ఇచ్చిన వివరణతో రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో హెచ్ సీఏ అధ్యక్ష బరిలో వివేక్, విద్యుత్ జయసింహలు మిగిలారు.