: హిల్లరీ క్లింటన్ ను టార్గెట్ చేసిన ట్రంప్... పాత కేసులపై తిరిగి విచారణ!


"నేను అధికారంలోకి వస్తే హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తా" ఎన్నికల ముందు ప్రచారం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పలు మార్లు చేసిన వ్యాఖ్యలివి. అసలే దురుసు స్వభావం వున్న ట్రంప్, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక హిల్లరీని టార్గెట్ చేయనున్నారా? పాత కేసులను మళ్లీ తిరగదోడనున్నారా? అంటే అవుననే అంటున్నారు  యూఎస్ న్యాయాధికారి, ఇనస్టెక్టర్ జనరల్ ఆండ్రూ నపోలిటానో.

ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ కొనసాగిన సమయంలో, తన అధికారిక కార్యకలాపాలకు వ్యక్తిగత ఈ-మెయిల్స్‌ ను వాడారంటూ, ఆరోపణలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఎఫ్బీఐ రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, మరోసారి విచారణ చేసే అవకాశం ఉందని ఆండ్రూ వెల్లడించారు. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలంటూ పిటిషన్ దాఖలు అయిందని ఆయన అన్నారు. హిల్లరీపై తిరిగి విచారణ జరిపించాలన్న ఆలోచన వెనుక ట్రంప్ ఉన్నారని అమెరికన్లు చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News