: వ్యాపారమంతా దేవాన్ష్ దే... లోకేష్ సంచలన ప్రకటన
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని కాశిపెట్లలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ ఫ్యాక్టరీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో హెరిటేజ్ వ్యాపారాన్ని తన కుమారుడు దేవాన్ష్ చూసుకుంటాడని చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతున్న వేళ ఆయన నోటి వెంట దేవాన్ష్ పేరు వచ్చింది. సంస్థను స్థాపించినప్పుడు పరిస్థితులు, ఆపై ఎన్ని కష్టాలతో అభివృద్ధి చేస్తూ వచ్చామన్న విషయాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం పాల్గొన్నారు. కాగా, లోకేష్ వ్యాఖ్యలు, తాను రాజకీయాలకే పరిమితమన్న సంకేతాలను ఇస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.