: చంద్రుడి వయస్సుపై గత అంచనాలన్నీ తప్పు: తాజా అధ్యయనం


భూమికి ఉపగ్రహంగా ఉన్న చంద్రుడి వయస్సు ఎంత? ఈ ప్రశ్నకు ఇంతవరకూ అనుకుంటూ వచ్చిన సమాధానం 311 కోట్ల సంవత్సరాలని. కానీ, ఈ జవాబు తప్పని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. చంద్రుడి వయస్సు 451 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. 1971లో అపోలో 14 మిషన్ చంద్రుడిపై నుంచి తెచ్చిన 'జిర్కాన్స్' అనే ఖనిజాన్ని అత్యాధునిక పద్ధతుల్లో పరిశీలించిన సైంటిస్టులు ఈ విషయాన్ని తేల్చారు. పలు రకాల సాంకేతిక టెక్నిక్ లను ఖనిజ విశ్లేషణకు వాడామని లాస్ ఏంజిల్స్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా జియో కెమిస్ట్ మిలానీ బార్బోనీ వెల్లడించారు. అప్పటికే ఉన్న భూమిని థియా అనే ప్లానెటరీ ఎంబ్రియో ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడన్న సంగతి తెలిసిందే. సౌర వ్యవస్థ ఏర్పడిన 6 కోట్ల సంవత్సరాల తరువాత చంద్రుడి ఆవిర్భావం జరిగిందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News