: నిరుద్యోగుల్లారా బహుపరాక్!.. ఈ ఏడాది దేశంలో పెరగనున్న నిరుద్యోగం
ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు చేదువార్త. ఈ ఏడాది భారత్ లో నిరుద్యోగ శాతం పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దేశంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతుండడమే ఇందుకు కారణమని ఐరాసకు చెందిన కార్మిక సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. 2017-18లో ఆర్థిక ప్రగతి మందగిస్తుందని, తద్వారా నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో నిరుద్యోగుల సంఖ్య 1.77 కోట్ల నుంచి 1.78 కోట్లకు పెరుగుతుందని తెలిపింది.