: గౌతమిపుత్రుడికి ఎమ్మెల్యేల అభినందన
నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిరోజే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసి బాలకృష్ణ అద్వితీయ నటనను కొనియాడారు. తాజాగా శుక్రవారం విజయవాడలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు బాలకృష్ణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఘన విజయం సాధించడంపై బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.