: భారత రెస్టారెంట్ ఆతిథ్యానికి ఫిదా... 79 పౌండ్ల బిల్లుకు 1000 పౌండ్ల టిప్పిచ్చి వెళ్లిన వ్యక్తి!
అతిథులను గౌరవించడంలో భారతీయులు ఎంత ముందుంటారో ప్రపంచానికి మరోసారి తెలిసింది. ఉత్తర ఐర్లాండ్ లోని పోర్టాడౌన్ లోని భారత రెస్టారెంట్ లో జరిగిన ఘటనను బీబీసీ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. ఈ హోటల్ లో ఐదుగురు వ్యక్తులతో కలసి డిన్నర్ చేసేందుకు వచ్చిన ఓ వ్యాపారి, హోటల్ నిర్వాహకులు చూపిన ఆప్యాయతకు, బాబు అనే కుక్ చేసిన వంటల రుచికి ఫిదా అయిపోయాడు. బిల్లు 79 పౌండ్లు అయితే, 1000 పౌండ్లు టిప్పిచ్చి వెళ్లిపోయాడు. అతనిచ్చిన టిప్పు చూసి తమకు నోట మాట రాలేదని, ఇది తమ రెస్టారెంటుకు దక్కిన గౌరవమని రెస్టారెంట్ యజమాని లూనా వెల్లడించారు. ఈ టిప్పును హోటల్ లో పని చేస్తున్న అందరికీ పంచినట్టు తెలిపారు.