: మరో బంపరాఫర్ తో ముందుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. అంతర్జాతీయంగా ఉచిత వైఫై
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎన్ఎల్) మరో బంపరాఫర్ తో ముందుకొచ్చింది. తమ కస్టమర్లకు అద్భుతమైన డేటా అనుభవాన్ని అందించేందుకు అంతర్జాతీయంగా ఉచిత వైఫై సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం టాటా కమ్యూనికేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థతో కలిసి వైఫై, వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కోసం ఓ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. టాటా కమ్యూనికేషన్స్ తో కుదుర్చుకున్న తాజా ఒప్పందం ప్రకారం బీఎస్ఎన్ఎల్ వందకుపైగా దేశాల్లో 4.4 కోట్ల వైఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు దేశం వెలుపల ఉన్నప్పుడు కూడా వీటి ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉచిత వైఫైని ఉపయోగించుకోవచ్చు. పాస్ వర్డ్ ల విషయంలో గందరగోళం లేకుండా ఉండేందుకు వైఫై హాట్ స్పాట్ కు ఒక్కసారి కనెక్ట్ అయితే సరిపోతుందని వేరే దేశం, ఖండంలో ఎక్కడున్నా ఎంచక్కా ఉచిత వైఫైని ఉపయోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.