: కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లెవరైనా ఫ్టస్ టైమే అధికారంలోకి రావాలి: జేసీ దివాకర్ రెడ్డి


కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లెవరైనా సరే ఫ్టస్ టైమే అధికారంలోకి రావాలని, అలా కాకుండా రెండో సారో, మూడో సారో అధికారంలోకి వచ్చిన వాళ్లను తాను ఇంతవరకూ చూడలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ నివాసానికి ఆయన వెళ్లారు. అనంతరం, మీడియాతో జేసీ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారా? అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.

‘మొన్నొచ్చిన కేజ్రీవాల్ వెంటనే అధికారంలోకి వచ్చారు. బీఎస్పీ నేత మాయావతి కూడా అంతే. యూపీలో అఖిలేశ్ యాదవ్ కూడా పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చారు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటారు అట్లా, ప్రజలను ఆకర్షించుకుని ఎకాఎకీన అధికారంలోకి వచ్చినవాళ్లే!’ అని జేసీ అన్నారు.

  • Loading...

More Telugu News