: ఆయన ఆఫీసులో చిరంజీవి ఫొటో మాత్రమే ఉంటుంది!: వి.వి. వినాయక్
‘ఖైదీ నంబరు 150’ చిత్రానికి ఒక ఫైట్ మాస్టర్ గా పని చేసిన తమిళ స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ ఆఫీసులో రజనీకాంత్ ఫొటో కూడా ఉండదు, కానీ, చిరంజీవి ఫొటో మాత్రం ఉంటుందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కణల్ కణ్ణన్ కు చిరంజీవి గారంటే ఎంతో పిచ్చి. ఈ చిత్రంలో క్లయిమాక్స్ ఫైట్ ను ఆయనే చిత్రీకరించారు. ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, హైదరాబాద్ కు చెందిన జాషువా అనే ఫైట్ మాస్టర్.. ఇలా ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ బాగా పని చేశారు’ అని వినాయక్ చెప్పుకొచ్చారు.