: తట్టుకోలేకపోతున్నాం... ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి: భారత్ ను కోరిన నేపాల్


పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత మన దేశ ప్రజలు కరెన్సీ కొరతతో పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మన దేశంలో నోట్లను రద్దు చేస్తే, పక్కనున్న నేపాల్లో జనాలు నానా బాధలు పడ్డారు. ఆ దేశంలో మన కరెన్సీ విరివిగా చలామణిలో ఉండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో, భారత కొత్త కరెన్సీ ఆ దేశానికి పూర్తి స్థాయిలో అందడం లేదు. దీంతో అక్కడి పరిస్థితి దారుణంగా తయారయింది. ఈ నేపథ్యంలో, తమ దేశ ప్రజలు నోట్ల కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని... సమస్యను త్వరగా పరిష్కరించాలని భారత్ ను నేపాల్ కోరింది. సమస్యను వెంటనే పరిష్కరించలేకపోతే భారత్, నేపాల్ ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపింది. సమస్య పరిష్కారం కోసం నేపాల్ ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు భారత్ తో చర్చలు జరుపుతున్నారని నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు.  

  • Loading...

More Telugu News