: ఐపీఎల్ లో నేటి సందడి
ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ సాయంకాలం 4 గంటలకు హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఇందులో 'ముంబయి ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్' జట్లు తలపడనున్నాయి. అనంతరం 8 గంటలకు రాయ్ పూర్ వేదికగా 'ఢిల్లీ డేర్ డెవిల్స్- కోల్ కతా నైట్ రైడర్స్' జట్లు పోటీపడతాయి.
కాగా, నిన్నరాత్రి పుణే వారియర్స్ తో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటింది.37 పరుగుల తేడాతో వారియర్స్ ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు రైనా (63 నాటౌట్), ధోనీ (45 నాటౌట్) చలవతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 164 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పుణే వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఈ విజయం చెన్నై జట్టుకు వరుసగా ఆరవది.