: మమ్మల్ని అడ్డుకోవాలంటే అమెరికా యుద్ధం చేయాల్సి ఉంటుంది: చైనా


అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గద్దెనెక్కక ముందే చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇస్తుంటే... అంతే స్థాయిలో సమాధానమిస్తోంది చైనా. దక్షిణ చైనా సముద్రంలో చైనా నిర్మిస్తున్న కృత్రిమ దీవులను అడ్డుకుంటామని ట్రంప్ టీమ్ లో విదేశాంగ మంత్రిగా ఉన్న రెక్స్ టిల్లర్ సన్ నిన్న హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తిప్పికొట్టింది. మమ్మల్ని అడ్డుకోవాలంటే అమెరికా మాతో యుద్ధమే చేయాల్సి ఉంటుందని కవ్వించింది. అణుశక్తి కలిగిన ఓ రాజ్యాన్ని దాని ప్రాంతాల నుంచే తరిమేయాలనుకుంటే... ముందు మీ శక్తి ఎంతో చూసుకోవాలని సూచించింది. చైనాను అడ్డుకోవడంలో అమెరికాకు న్యాయపరమైన చిక్కులు కూడా ఉంటాయని తెలిపింది.

  • Loading...

More Telugu News