: ధాన్యం రాశులకు పూజ చేసి..చిన్నారులకు భోగి పళ్లు పోసిన బాలకృష్ణ


కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు, నిమ్మకూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కొమరవోలులోని తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం తన స్వగ్రామమైన నిమ్మకూరుకు ఎడ్ల బండిపై ప్రదర్శనగా వెళ్లారు. ధాన్యం రాశులకు పూజలు చేసిన బాలయ్య, చిన్నారులకు భోగి పళ్లు కూడా పోశారు. అలాగే అక్కడి రైతులను ఆయన సన్మానించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, భోగి పండగ రోజున తన తల్లి స్వగ్రామమైన కొమరవోలుకు రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పండగకు ముందే విడుదలైన తన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అద్భుత విజయం సాధించిందని, ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు తన కృతఙ్ఞతలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News