: ప్రయాణికుడు మరచిపోయిన క్యాష్ బ్యాగ్ ను భద్రంగా అందజేసిన ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్!
పికెట్ నుంచి యాదగిరిగుట్టకు వస్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు ఓ బ్యాగ్ మరచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగుని గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో 50 వేల రూపాయలు ఉన్నాయి. దాంతో వారిద్దరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సంబంధిత ప్రయాణికుడికి అది చేరేలా చేసి, అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఆ బ్యాగు గురించి బస్సు డ్రైవర్, కండక్టర్ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా బ్యాగులో ఉన్న వివరాల ఆధారంగా అది సుభాన్ అనే వ్యక్తికి చెందిన బ్యాగు అని గుర్తించారు. అనంతరం అతడిని పిలిపించి ఇచ్చేశారు. పోగొట్టుకున్న డబ్బు మళ్లీ తిరిగి రావడంతో సుభాష్ హర్షం వ్యక్తం చేశాడు. సదరు డ్రైవర్, కండక్టర్‌ల నిజాయతీని అందరూ మెచ్చుకుంటున్నారు.