: భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన కెనడియన్ మేయర్
భారతీయ సిక్కు సంప్రదాయాలను చూసి ముచ్చట పడటమే కాకుండా, సిక్కుల్లానే తలకు టర్బన్ కట్టుకుని అదిరిపోయే రీతిలో భాంగ్రా స్టెప్పులు వేశాడో కెనడియన్ మేయర్. వైట్ హార్స్ మేయర్ డాన్ కర్టిస్ వేసిన భాంగ్రా డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్టిస్ కు సిక్కుల టర్బన్ పై అమితమైన ఆసక్తి ఉంది. దీంతో, ఫందేర్ సింగ్ అనే వ్యక్తిని సిటీ కౌన్సిల్ ఛాంబర్ కు పిలిపించుకున్నాడు. ఈ సందర్భంగా టర్బన్ ఎలా కట్టుకోవాలో ఆయనకు ఫందేర్ నేర్పించాడు. ఆ తర్వాత మేయర్ కు స్వయంగా టర్బన్ కట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి భాంగ్రా స్టెప్పులతో ఇరగదీశారు. దీన్నంతా షూట్ చేయడానికి ఓ వీడియోగ్రాఫర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు డాన్ కర్టిన్. మరోవైపు, గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ కూడా ఇలాగే చేశారు.