: అక్కడ కాసేపు వ్యాయామం చేస్తే చాలు... కావాల్సింది ఫ్రీగా తినొచ్చు


మీరు చదివింది నిజమే. అక్కడ కాసేపు వ్యాయామం చేస్తే చాలు... ఫ్రీగా ఫుడ్ పెడతారు. వివరాల్లోకి వెళ్తే, లండన్ లోని కోవెంట్ గార్డెన్ ప్రాంతంలో 'రన్ ఫర్ యువర్ బన్' అనే కేఫ్ ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని, అనారోగ్యం పాలవుతున్న వారికి వ్యాయామం ప్రాముఖ్యతను తెలిపేందుకు డేవిడ్ లార్డ్ క్లబ్ అనే ఫిట్ నెస్ ట్రైనింగ్ సంస్థ ఈ కేఫ్ ను నిర్వహిస్తోంది. అక్కడకు వెళ్లి ఆరు నిమిషాల పాటు నాలుగైదు రకాల వ్యాయామాలు చేస్తే.. ఓ ఫుడ్ కూపన్ ఇస్తారు. ఆ కూపన్ తో కెఫేలో కావాల్సినవి తినొచ్చు. కావాలంటే ఇంటికి పార్శిల్ కూడా తీసుకెళ్లొచ్చు.

  • Loading...

More Telugu News