: నీ ధైర్యానికి అభినందనలు: శర్వానంద్ తో నాగార్జున


"ఓ కొదమసింహం, మరో సమరసింహం ఈ సంక్రాంతికి తలపడుతుంటే, మధ్యలో వస్తోందో చిట్టెలుక"... గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఇది. చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100 చిత్రం థియేటర్లను తాకి, రెండు చిత్రాలూ విజయవంతమైన వేళ, అంత భారీ స్టామినా ఉన్న హీరోలతో పోటీ పడుతున్నాడు 'శతమానం భవతి'తో శర్వానంద్.

ఇక ఇదే విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించిన నాగార్జున, శర్వానంద్ ధైర్యాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. రెండు పెద్ద హీరోల చిత్రాల నడుమ చిన్న చిత్రాన్ని విడుదల చేయడానికి ఎంతో ధైర్యముండాలని తెలిపాడు. శర్వానంద్ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. గత సంవత్సరంలానే, ఈ యేడాది కూడా సక్సెస్ సాధించాలని అన్నాడు.

  • Loading...

More Telugu News