: పులివెందులలో 'శాతకర్ణి' సినిమా ఫ్లెక్సీ తొలగింపు... బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం.. ఉద్రిక్తత!


వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల పట్టణంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ థియేటర్ వద్ద బాలయ్య అభిమానులు ఏర్పాటు చేసిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో, బాలయ్య అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్లెక్సీల తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ... వారు ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. 

  • Loading...

More Telugu News