: నాడు నేతాజీ నడిపిన కారు... 80 ఏళ్ల తరువాత ప్రణబ్ ముఖర్జీ ప్రయాణానికి సిద్ధం


నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వయంగా నడిపిన కారు, తిరిగి రోడ్డెక్కేందుకు సిద్ధమైంది. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీకి ఆ భాగ్యం దక్కనుంది. దాదాపు 8 దశాబ్దాలుగా ఓ అద్దాల గదిలో ఉన్న ఈ కారును తిరిగి స్టార్ట్ చేసేందుకు కారును తయారు చేసిన జర్మన్ సంస్థ ఆడీ సహకరించింది. నేతాజీ రీసెర్చ్ బ్యూరో, ఆడి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కారును తిరిగి సిద్ధం చేయగా, దీనిలో 18వ తేదీన తొలిసారిగా రాష్ట్రపతి ప్రయాణించనున్నారు.
1937లో వాండరర్ సెడాన్ సంస్థ దీన్ని తయారు చేయగా, బోస్ సోదరుడు కొనుగోలు చేసి ఇండియాకు తెప్పించారు. ఈ కారులో ప్రయాణిస్తూనే బోస్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆయన 'గ్రేట్ ఎస్కేప్' తరువాత, దీన్ని ఎవరూ వాడలేదు.

  • Loading...

More Telugu News