: పాతబస్తీలో 12 మంది రౌడీ షీటర్లు, 69 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 400 మంది పోలీసులతో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఆ ప్రాంతంలో 12 మంది రౌడీషీటర్లు, 69 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.