: భారత సముద్రాలకు కొత్త సంరక్షకుడు... 'ఐఎన్ఎస్ ఖాందేరి' గురించి ఆసక్తికర అంశాలు!


భారత నావికాదళాన్ని మరింత బలోపేతం చేస్తూ, అటు అరేబియా, ఇటు బంగాళాఖాతం సముద్రాల్లో కొత్త కాపలా శక్తిగా స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ 'ఐఎన్ఎస్ ఖాందేరీ' జాతికి అంకితమైంది. ఈ జలాంతర్గామి గురించిన మరిన్ని విశేషాలు...
* 17వ శతాబ్దం నాటి మరాఠా ద్వీప కోట ఖాందేరి పేరిట దీన్ని తయారు చేశారు.
* చాలా ఇతర జలాంతర్గాములతో పోలిస్తే, దీనితో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించవచ్చు.
* ముంబైలో మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది.
* ఫ్రాన్స్ నౌకాదళ సంస్థ డీసీఎన్ఎస్ ఖాందేరి తయారీకి సహకరించింది.
* దీనిలోని పలు విడి భాగాలను ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెచ్చి జతచేశారు.
* అగ్రదేశాల సబ్ మెరైన్లలో ఉన్న అన్ని రకాల నిఘా వ్యవస్థలూ ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News