: ఆ ఇద్దరినీ చూసి గర్వపడుతున్నా: రాఘవేంద్రరావు


సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలయ్యల సినిమాలు 'ఖైదీ నంబర్ 150' ,'గౌతమీపుత్ర శాతకర్ణి' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా చిరంజీవి, బాలయ్యలపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

చిరంజీవి సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది అనేది కేవలం మాట వరసకే అని రాఘవేంద్రరావు అన్నారు. చిరంజీవిలోని జోరు, ఊపు, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. 'జై చిరంజీవా... జగదేకవీరా' అంటూ ట్వీట్ చేశారు. తెలుగువాడు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో అద్భుతమైన నటనతో బాలయ్య జీవించారని అన్నారు. తెలుగు వాడి చరిత్రని దశదిశల చాటి చెబుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి సాటి తెలుగువాడిగా తాను కూడా గర్వపడుతున్నానని చెప్పారు. 'సాహో శాతకర్ణి... జయహో శాతకర్ణి' అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి, బాలయ్యలను చూసి గర్విస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News