: రష్యాతో అమెరికాకు ప్రమాదమే!: ట్రంప్ ఎంపిక చేసుకున్న సీఐఏ చీఫ్


రష్యాతో అమెరికాకు ప్రమాదమేనని సీఐఏ కాబోయే చీఫ్ మైక్ పోమ్ పియో వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత మైక్, సీఐఏకు చీఫ్ కానున్నారు. రష్యాతో పాటు సిరియా, ఇరాన్, ఐఎస్ఐఎస్ ల నుంచి అమెరికా పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆయన అన్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవడం వ్యూహాత్మక చర్యేనని అన్నారు.

ఐఎస్ఐఎస్ పై వ్యతిరేకంగా పోరాడే వాళ్లకు సాయపడాలన్న పాత ప్రభుత్వ విధానాలను కొత్త సర్కారు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రష్యాతో స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని, ఇదే సమయంలో అమెరికా ప్రయోజనాలూ తమకు ముఖ్యమేనని అన్నారు. చిన్న దేశాలపై రష్యా పెత్తనాలను నిలువరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉక్రెయిన్ ను ఆక్రమించాలని మరిన్ని ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటామని మైక్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News