: 'మీ వద్ద రూ. 2 వేలు ఉందా?', ప్యాసింజర్ ను అడిగి తీసుకున్న చెన్నై క్యాబ్ డ్రైవర్, ఆ తరువాత ఏమైందంటే..!


పెద్ద నోటు చేతిలో ఉంటే చిల్లర ఎవరిస్తారు? గడచిన రెండు నెలలుగా భారతీయులను పీడిస్తున్న ప్రశ్న ఇది. చేతిలో పెద్ద నోటున్నా, దాన్ని మార్చుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఇక తనకు చెన్నైలో ఎదురైన ఓ అనుభవాన్ని క్రిష్ అశోక్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.

ఉబెర్ కు చెందిన ఓ క్యాబ్ ను బుక్ చేసుకున్న అశోక్, క్యాబ్ లో వెళుతుండగా, "మీ వద్ద రూ. 2 వేల నోటుందా?" అని అడిగాడు క్యాబ్ డ్రైవర్. వుందని తీసిస్తూనే, "ఎందుకు?" అని ప్రశ్నించారు అశోక్. దానికి "వెయిట్ అండ్ వాచ్" అని చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ఆ తరువాత క్యాబ్ ఓ టోల్ బూత్ వద్దకు చేరుకుంది.

అక్కడి ఉద్యోగికి క్యాబ్ డ్రైవర్ రూ. 2 వేల నోటిచ్చాడు. దాన్ని చూసిన ఉద్యోగి, చిల్లర లేదా? అని ప్రశ్నించి, నా వద్ద కూడా లేదు. నువ్వెళ్లమని సమాధానం ఇచ్చాడు. పెద్ద నోటుతో చిల్లర సమస్య ఇంకా తీరలేదన్న విషయం క్యాబ్ డ్రైవరుకు తెలుసునని, టోల్ బూత్ వద్ద చెల్లించాల్సిన ఫీజును చెల్లించకుండా ఉండేందుకే అతను రూ. 2 వేల నోటును అడిగాడని తన అనుభవాన్ని అశోక్ తెలిపారు. అశోక్ పోస్టును 2 వేల మందికి పైగా షేర్ చేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News