: గాలిపటం, బొంగరాలు, గోలీలు, కర్రాబిళ్ల ఆటలతో... సంక్రాంతి నాడు చంద్రబాబు ఫుల్ ఎంజాయ్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.  ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు హాజరైన చంద్రబాబు సంబరాలను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గాలిపటాన్ని ఎగురవేశారు. అనంతరం బొంగరంతో ఆడారు. ఆ తర్వాత కర్రాబిళ్ల ఆట ఆడారు. అనంతరం గోలీల ఆట ఆడారు. ఇప్పటి తరం మరిచిపోయిన ఆటలన్నింటినీ చంద్రబాబు ఆడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. విజయవాడలోని ఏ-వన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News