: ఉత్తరాదిన మైనస్ 16 డిగ్రీలు... పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు


ఉత్తరాదిని చలిపులి చంపేస్తోంది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాశ్మీరు లోయలో మైనస్ 16 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. దీంతో లోయంతా మంచుతో నిండిపోగా, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై మంచు పెద్దఎత్తున కూరుకుపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 3.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిపులితో జనజీవనం స్తంభించింది. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరే వరకూ సెలవులు కొనసాగుతాయని ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News