: సంక్రాంతి వేడుకల్లో బాలయ్య... ఎద్దుల బండి ఎక్కి హల్ చల్


'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయాన్ని బాలకృష్ణ, క్రిష్, శ్రియ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని వీరు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, బాలయ్యకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కృష్ణా జిల్లా కొమరవోలులో సంక్రాంతి సంబరాల్లో బాలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎడ్లబండి ఎక్కి హల్ చల్ చేశారు. బాలయ్య రాకతో కొమరవోలులో సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News