: యూఎస్ లో బాలయ్య గత రికార్డులు బద్దలయ్యాయి... తొలి రోజు కలెక్షన్ వివరాలు


నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' (జీపీఎస్కే) చిత్రం అమెరికాలో ఆయన పాత చిత్రాల తొలి రోజు కలెక్షన్ రికార్డులను తిరగరాసింది. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజున 45 వేల డాలర్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక చిత్రం సూపర్ హిట్టన్న టాక్ రావడంతో మరిన్ని థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి పోటీలో ఉన్న చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' యూఎస్ లో 1.25 మిలియన్ డాలర్లను వసూలు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రాలకు సంబంధించి అమెరికా తొలి రోజు వసూళ్లలో జీపీఎస్కే టాప్-10లో నిలిచిందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News