: భోగిమంటల్లో పడిన వ్యక్తి... వెంటనే స్పందించి కాపాడిన ఎమ్మెల్యే మోదుగుల
భోగి మంటల వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమానికి పెద్ద ఎత్తున నేతలు, ప్రజలు తరలివచ్చారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి మంటలంటుకున్నాయి. పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, అతన్ని కాపాడారు. వెంటనే అతనిని పక్కకు లాగి మంటలను ఆపే ప్రయత్నం చేశారు. ఘటనలో గాయాలపాలైన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.