: బ్యాంకు లీలలు: రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిగా మారిన కూలీ.. అకౌంట్ లో రూ.5.81 కోట్లు జమ!
ఓ మహిళా కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిగా మారిపోయింది. కర్ణాటకలో ఈ వింత చోటుచేసుకుంది. నంజనగూడు తాలూకా హుల్లహళ్లి గ్రామానికి చెందిన లీలా నాగరాజ్ కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల ఆమె మొబైల్ కు రూ.5.81 కోట్లు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో అవాక్కయిన ఆమె వెంటనే దానిని భర్తకు చూపించింది. ఇంత భారీ మొత్తంలో డబ్బులు జమకావడంతో ఆయన విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు ఆరా తీస్తున్నారు.