: జల్లికట్టుపై తమిళనాట రాజుకున్న వేడి.. ఇప్పటికే పలుచోట్ల మొదలైన సంప్రదాయ క్రీడ!


జల్లికట్టుపై సుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు రగులుతోంది. తీర్పును గౌరవించేది లేదని తమిళులు తేల్చి చెబుతున్నారు. కేంద్రం, సుప్రీం తీరుపై మండిపడుతున్న ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల జల్లికట్టు క్రీడను నిర్వహిస్తున్నారు. తమిళుల తీరు చూస్తుంటే ఇది క్రమంగా రాష్ట్రం, కేంద్రం మధ్య పోరుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి రోజున జల్లికట్టు నిర్వహించాల్సిందేనంటూ రాష్ట్రంలోని మధురై, కడలూరు, తిరునల్వేలి, తిరుచ్చి తదితర జిల్లాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో తమిళనాట నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. మూడువేల మంది విద్యార్థులు మధురై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. చెన్నైలోని న్యూ కళాశాల విద్యార్థులు గురువారం ప్లకార్డులు చేబూని జలికట్టుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రముఖ నటుడు కమలహాసన్, దర్శకుడు భారతీరాజా, విజయ్, టి.రాజేందర్ తదితరులు ఇప్పటికే జల్లికట్టుకు మద్దతు పలికారు.

  • Loading...

More Telugu News