: జగన్ తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబే.. ఇప్పుడు జగన్ ను అంతమొందించే కుట్ర జరుగుతోంది!: భూమన తీవ్ర ఆరోపణలు


వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి ఉసురు తీసింది చంద్రబాబేనని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు జగన్ ను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కలిసి కుట్రలు చేసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు. అప్పట్లో వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులకు ఇప్పుడు బాబు రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్నారన్నారు. కడప జిల్లాతో సంబంధం లేని నేతలను పిలిపించి మరీ జగన్ ను వారితో తిట్టిపోయిస్తున్నారంటూ పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News