: కేసీఆర్ సరికొత్త నిర్ణయం.. సంక్రాంతి తర్వాత ప్రజాదర్బార్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. పండుగ తర్వాత ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని కులాలు, వర్గాలతో విధిగా సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సంక్రాంతి తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. నూతనంగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనే ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు, సన్నిహిత మంత్రులతో సమావేశమై ప్రజాదర్బార్ గురించి చర్చించినట్టు సమాచారం. తనను కలిసేందుకు, సాయం అర్థించేందుకు వచ్చే బాధితులు, ఆపన్నులకు సైతం వీలు కల్పించాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News